EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో దాదాపు అందరికీ ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఖాతాదారులకు పీఎఫ్‌తో పాటు వడ్డీ అందిస్తుంది. ఏ పెట్టుబడి లేకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ సైతం లభిస్తుంది. అయితే కొందరు ఉద్యోగులకు తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడం తెలియదు. కారణం ఆ ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తెలియదండి అని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. 

  • Dec 07, 2020, 08:33 AM IST

EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో దాదాపు అందరికీ ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఖాతాదారులకు పీఎఫ్‌తో పాటు వడ్డీ అందిస్తుంది. ఏ పెట్టుబడి లేకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ సైతం లభిస్తుంది. అయితే కొందరు ఉద్యోగులకు తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడం తెలియదు. కారణం ఆ ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తెలియదండి అని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. 

1 /8

EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో దాదాపు అందరికీ ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఖాతాదారులకు పీఎఫ్‌తో పాటు వడ్డీ అందిస్తుంది. ఏ పెట్టుబడి లేకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ సైతం లభిస్తుంది. అయితే కొందరు ఉద్యోగులకు తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడం తెలియదు. కారణం ఆ ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తెలియదండి అని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. మరి ఆ UAN నెంబర్ ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కు ఎలా లింక్ చేసుకోవాలో ఇక్కడ పూర్తి వివరాలు మీకోసం..

2 /8

మీ ప్లే స్లిప్ (Salaryslip or Payslip)లో యూఏఎన్ నెంబర్ ఉంటుంది. అందులో UAN లేకుంటే మీ కంపెనీ హెచ్ఆర్‌ను సంప్రదించాలి. అయితే ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అయ్యే వారికి మాత్రమే ఈ యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీ యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

3 /8

మొదటగా EPFO వెబ్‌సైట్‌ లింక్ ఓపెన్ చేయాలి. అందులో కుడివైపు  కింది భాగంలో ఓచోట Activate UAN ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

4 /8

మీ Payslipలో ఉన్న UAN నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు Captcha Text అక్కడ అందించాలి. కీ ఆథరైజేషన్ పిన్ పొందడానికి క్లిక్ చేయండి.

5 /8

ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని కాపీ చేసుకోండి.

6 /8

EPFO వెబ్‌సైట్‌లోని అన్ని వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత ఈ వివరాలకు అంగీకారం తెలుపుతూ పక్కన ఉన్న I Agree చెక్ బాక్స్‌ను టిక్ చేయండి.

7 /8

మీ ఫోన్‌కు వచ్చిన OTPని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ తరువాత Validate OTP and Activate UAN మీద క్లిక్ చేయండి. ప్రక్రియ పూర్తయింది.  Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

8 /8

ఇప్పుడు మీ UAN యాక్టివేట్ అవుతుంది. మరియు మీ మొబైల్ నంబర్‌కు ఓ పాస్‌వర్డ్ వస్తుంది. ఆరు గంటలు తర్వాత మీరు EPFO కు లాగిన్ అయ్యి మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. తొలిసారి కనుక UAN యాక్టివేట్ అయ్యాక 6 గంటలు వేచి చూడక తప్పదు. దీని ద్వారా పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీలో చేరినప్పుడు బదిలీ చేసుకోవచ్చు. అవసరం ఉన్న సమయంలో మీ పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు